పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి బిజెపి -టిడిపి కూటమికి మద్దతిచ్చి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ కూటమి విజయానికి మూల కారకుడయ్యాడు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రత్యర్ధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ జగన్ వస్తే అరచాకమే రాజ్యమేలుతుందని అనుభవజ్ఞుడు అయిన బాబు కు ఒటేస్తేనే సీమాంద్ర ని అభివృద్ధి చేయడానికి వీలు అవుతుందని చెప్పి తన ప్రసంగాలతో ప్రజలను ప్రభావితం చేసాడు పవన్ కళ్యాణ్. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాపు ఓట్లను ప్రభావితం చేయడమే కాకుండా యుత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కావడంతో ఆ శ్రేణులను కూడా బాగా ప్రభావితం చేసాడు. అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చి ఓటమి పాలైతే ...... తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చి మరో కూటమికి మద్దతు ఇచ్చి నైతిక విజయం సాధించాడు పవన్ కళ్యాణ్ . దేశ వ్యాప్తంగా మోడీ మేనియా ఎంతగా పని చేసిందో రాష్ట్రంలో పవన్ మేనియా కూడా అంతగా పని చేసిందనే చెప్పాలి.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment