వినడానికి కాస్త షాకింగ్ గానే ఉన్నా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్ కళ్యాన్ సినిమాలని తెలంగాణాలో అసలు విడుదల కానివ్వం అని, ఆయన సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు సీమాంధ్రకి వెళ్ళి చూసుకోవాలని అన్నట్టు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. నిజంగానే కేసీఆర్ సరిగ్గా ఇలాగే అన్నాడో లేక మీడియా యధాతధంగా ఆయన మాట్లాని వక్రీకరించిందో తెలియదు కానీ, ఈ వార్త పవన్ అభిమానుల్లో కలకలం రేపుతోంది అని సమాచారం. ఇంతకీ, కేసీఆర్ కి అలా ఆనాళ్సిన అవసరం ఏమిటో అని అసలు విషయం ఆరా తీస్తే, ఎన్నికల ప్రచార సమయంలో పవన్ తనని నోటికొచ్చినట్టు మాట్లాడటం, కనీసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అయినా, సినిమా పరిశ్రమ పెద్దలంతా వచ్చి తనని కలిసి శుభాకాంక్షలు తెలిపినా, పవన్ మాత్రం రాకపోవడం కేసీఆర్ కి కోపం తెప్పించింది అని ఆ పత్రిక రాసింది.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment