ఆగస్ట్ 14న ఎన్టీఆర్ రభస


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం '' రభస ''. ఈ చిత్రం ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది,ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ సరసన సమంత , ప్రణీత లు నాయికలుగా నటిస్తున్నారు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో రభస ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ యంగ్ టైగర్ లా ఉన్నాడు,జులైలో ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించి ఆగస్ట్ 14న భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments: