ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇది పూర్తయిన వెంటనే యూరప్ , యూఎస్ లలోని టూరిస్టు ప్లేసుల్లో హాలీడే గడపనున్నాడు. దాదాపు 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.
పవన్ తర్వాతి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈలోగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకు అన్నీ సిద్ధం చేయనున్నాడు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలిసి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది.
0 comments:
Post a Comment