ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28 విడుదల కాబోతున్న చిత్రం బాహుబలి. కర్నాటకలో బాహుబలి-2 విడుదలకు అడ్డంకులు తొలగాయి. కావేరీ జలాల వివాదంపై తమిళ నటుడు, బాహుబలిలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో బాహుబలి-2 విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. దీంతో శుక్రవారం సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కర్నాటకలో విడుదల చేసేందుకు కన్నడ సంఘాలు అంగీకరించాయి.
కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వి.నాగరాజ్ శనివారం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్లో కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతర భాషల నటులు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో బాహుబలి-2 విడుదలను అడ్డుకోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో సినిమా విడుదలకు రంగం సిద్ధమవ్వడంతో బాహుబలి టీం ఊపరి పీల్చుకుంటోంది.

0 comments:
Post a Comment