పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఫస్ట్ డే కల్లెక్షన్

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ,డాలీ దర్శకత్వం లో శరత్ మరార్ నిర్మించిన కాటమరాయుడు మూవీ ప్రపంచ వ్యాప్తం గా మార్చ్ 24  న విడుదలై విజయవంతంగా ఆడుతుంది .విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు మూవీ ఒక్క ఆంధ్ర ప్రదేశ్  , తెలంగాణ లో నే కాకుండా ఇతర రాష్ట్రాలు లోను మరియు USA లాంటి దేశాలలోను హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతుంది .తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. మామూలుగా ఇండస్ట్రీ హిట్లు రావాలంటే కంటెంట్ అసాధారణంగా.. అద్భుతంగా ఉండాలి. కానీ ‘గబ్బర్ సింగ్‘.. ‘అత్తారింటికి దారేది‘ లాంటి ఓ మోస్తరు కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా ఆల్ టైం హిట్లు అందుకున్న ఘనత పవన్ కళ్యాణ్ ది. చేసింది తమిళ్ లో అజిత్ నటించిన వీరం సినిమా రీమేక్ చేసినప్పటికీ ఎంచుకున్న కథని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ అఫ్ యాక్టింగ్ కి అనుగుణంగా కొన్నిమార్పులు చేసి దర్శకుడు డాలీ అద్భుతంగా తెరకేక్కిన్చాడు . 
 
మొత్తానికి కాటమరాయుడు సినిమా లో పవన్ కళ్యాణ్ కామెడీ మరియు తనకి తమ్ముళ్లు గ నటించించిన అజయ్ , చైతన్య , శివ బాలాజీ సెంటిమెంట్ యాక్టింగ్ మరియు పవన్ కళ్యాణ్ ,స్రుతి హాసన్  ల లవ్ ట్రాక్ సినిమా కి హైలెట్ గా వచ్చిన సమాచారం ప్రకారం మొదటి రోజు కాటంరాయుడు సినిమా ఆంధ్ర & తెలంగాణ రాష్ట్రాలలో 24 .05 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. 

Author: Manikyam
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments: